కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ నన్ను కల్సిండు

నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని..కేటీఆర్ ను సీఎం చేస్తానని తనతో చెప్పారని మోదీ తెలిపారు. మీ ఆశీర్వాదం కావాలంటూ కేసీఆర్ కోరినట్లు వెల్లడించారు. కానీ తాను తిరస్కరించానన్నారు.  కేటీఆర్ ఏమైనా యువరాజా..?  ఇది రాజరికం కాదు..ప్రజాస్వామ్యం అని కేసీఆర్ తో  చెప్పానన్నారు. ఆ తర్వాత కేసీఆర్ తన కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేదన్నారు. అప్పటి నుంచి కేసీఆర్ తనను కలవడం లేదన్నారు. అందుకే తాను తెలంగాణకు వచ్చినప్పుడల్లా..కేసీఆర్ తనను కలిసే ధైర్యం చేయడం లేదని మోదీ స్పష్టం చేశారు. 

ALSO READ: కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం : కిషన్ రెడ్డి

అంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. తనపై కేసీఆర్ ఎప్పుడు లేనంత ప్రేమ, అభిమానం కురిపించారని తెలిపారు.   శాలువా, పూలతో తనను సత్కరించారని వెల్లడించారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుందని..జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలని కోరినట్లు మోదీ తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రగతిలో దూసుకుపోతుందని.. తనను కూడా ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరినట్లు మోదీ పేర్కోన్నారు. కానీ కేసీఆర్ ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదన్నారు. తాము ప్రతిపక్షంలో అయినా  కూర్చుంటాం కానీ..తెలంగాణ ప్రజలను మోసం చేయమని చెప్పానన్నారు.