
గిర్సోమ్నాథ్: గుజరాత్లోని సోమ్నాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతిర్లింగాల లో మొదటిదైన శివాలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం జామ్నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన వంతారాను సందర్శించు కున్నారు.
ఆ తర్వాత జునాగఢ్ జిల్లాలోని ఆసియా సింహాల నివాసమైన గిర్ వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కార్యాలయం సాసన్కు మోదీ బయల్దేరారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాసన్ లో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్ బీడబ్ల్యూఎల్) మీటింగ్ కు అధ్యక్షత వహించనున్నారని అధికారులు తెలిపారు.