‘లోకల్ ఫర్ దివాళీ’కి ప్రధాని మోడీ పిలుపు

లోకల్ ప్రొడక్టులు కొనండి

‘లోకల్ ఫర్ దివాళీ’ని ప్రోత్సహించండి

ప్రమిదతో పాటూ పండుగకు అవసరమైనవన్నీ కొనండి
దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు
స్థానిక ఉత్పత్తులతో ఎకానమీకి కొత్త ఊపు వస్తుందని కామెంట్
వారణాసిలో రూ.614 కోట్ల పనులకు శంకుస్థాపనలు

న్యూఢిల్లీ/లక్నో: ఈ పండుగ సీజన్‌‌లో ‘లోకల్ ఫర్ దివాళీ’ని ప్రోత్సహించాలని, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఇది ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు. స్థానిక ప్రొడక్టులను కొనడం ద్వారా లోకల్ ఐడెంటిటీని బలోపేతం చేయడమే కాకుండా.. వాటిని తయారు చేసే వారి జీవితాల్లోనూ వెలుగులు నింపవచ్చని తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో రూ.614 కోట్ల విలువైన టూరిజం, అగ్రికల్చర్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘వోకల్ ఫర్​ లోకల్​తోపాటు లోకల్ ఫర్ దివాళీ మంత్రం ఇప్పుడు ప్రతిచోటా ప్రతిధ్వనించడం మీరు చూస్తున్నారు. స్థానిక ఉత్పత్తులతో దివాళీ జరుపుకోవడం ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది. లోకల్​ఫర్ దివాళీని ప్రోత్సహించాలని దేశ ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. ‘‘లోకల్ అంటే ప్రమిదలను కొనడం మాత్రమే కాదు. దివాళీకి ఉపయోగించే ప్రతి ఒక్కటీ కొనడం. ఇలా చేస్తే.. వాటిని తయారు చేసే వారిని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది” అని చెప్పారు.

వారణాసికి కొత్త గుర్తింపు

వారణాసి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, సిటీకి కొత్త గుర్తింపు వస్తోందని మోడీ పేర్కొన్నారు. పనులకోసం ఢిల్లీ దాకా వెళ్లకుండా అందరికీ ఉపాధి కల్పిస్తోందన్నారు. కరోనాను ఎదుర్కోడంలో వారణాసి ప్రజలు సోషల్ యూనిటీ చూపారని ప్రధాని మోడీ అభినందించారు.

కొత్త చట్టాలతో దళారులకు చెక్‌‌

ఈ మధ్య తీసుకొచ్చిన అగ్రికల్చర్ రీఫార్మ్స్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. మార్కెట్లతో రైతులను కనెక్ట్ చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడుతాయని, సిస్టమ్​నుంచి దళారులను బయటికి పంపుతాయని చెప్పారు. దీంతో రైతులకు డైరెక్ట్​గా ప్రయోజనాలు అందుతాయని వెల్లడించారు. స్వామిత్వ పథకం కింద రైతులకు ప్రాపర్టీ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్డుల వల్ల రైతులకు లోన్లు అందుతాయని చెప్పారు. అలాగే రైతుల ఆస్తులను లాక్కునే ఆటలు ఇక ముగిసిపోతాయని అన్నారు.

For More News..

కరోనాపై ఫైట్‌కు బైడెన్​ టాస్క్‌‌ఫోర్స్‌‌

నేనోడిపోలే.. కుర్చీ దిగ