దేశ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

దేశ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

గాంధీనగర్: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీ కూడా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దేశ సరిహద్దుల్లో జవాన్లతో కలిసి మోడీ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని తన సొంత రాష్ట్రమైన గుజరాత్‎లో మోడీ గురువారం (అక్టోబర్ 31) పర్యటించారు. ఈ సందర్భంగా.. గుజరాత్‌లోని కచ్‌ తీరంలో గస్తీ కాస్తోన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. 

నేవీ బోట్‎లో కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతానికి చేరుకున్న మోడీ.. లక్కీ నాలా వద్ద మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైనికులకు మోడీ స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు కొందరికి స్వయంగా ఆయనే తినిపించారు. ప్రధాని మోడీ కూడా బీఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ జవాన్లు పార్టిసిపేట్ చేశారు. 

ALSO READ | ఆర్టికల్ 370 గోడలను బద్దలు కొట్టాం : మోదీ

మరోవైపు.. భారత్ -పాక్ బార్డర్‎లో కూడా బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. రాజస్థాన్‎లోని జైసల్మేర్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు దీపాలు వెలిగించి.. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇండియా, చైనా బార్డర్‎లో కూడా భారత సైనికులు దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చైనా సైనికులు భారత జవాన్లు మిఠాయిలు పంచి పండుగ శుభాకాంక్షలు చెప్పారు.