న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇటీవల జరిగిన మోదీ ఉక్రెయిన్ పర్యటనపై చర్చించారు. ‘ఈ రోజు పుతిన్‌తో మాట్లాడాను. భారత్ -రష్యా దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థంగాలేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశా. ఉక్రెయిన్‌తో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించా’ అని మోదీ ట్వీట్ చేశారు.