ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించిన మోదీ ప్రజలకు అభివాదం చేశారు. దారివెంట 1400 మంది కళాకారులు కార్యకర్తలు ఆయనకు ప్రదర్శన ఇస్తూ స్వాగతం పలికారు.
Prime Minister Narendra Modi arrives in Ayodhya; received by Uttar Pradesh Governor Anandiben Patel and CM Yogi Adityanath
— ANI (@ANI) December 30, 2023
PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/yWqDDowRcm
రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఉదయం అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ , మధ్యాహ్నం ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించనున్నారు. ఒంటి గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15వేల 700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయింది. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపనకు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.