ప్రధాని మోదీ గతకొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నారు. శనివారం నుంచి ఆయన నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలు పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 20)న గయానాలోని జార్జ్‌టౌన్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆయనకు స్వాగతించారు. ప్రవాస భారతీయులు మోదీకి ఇండియన్ కల్చర్ లో స్వాగతం పలికారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్‌అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గయానా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
#WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome from members of the Indian diaspora in Guyana as he arrives at a hotel in Georgetown.
— ANI (@ANI) November 20, 2024
PM Modi is on a 2-day visit to Guyana. During his visit, he will hold a bilateral with President Mohamed Irfaan Ali and will… pic.twitter.com/ltZIuLlypf
బ్రెజిల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సులో అర్థవంతమైన చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నైజీరియా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది భారత్ జీ-20 సదస్సుకు అధ్యక్ష స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
#WATCH | PM Narendra Modi witnesses cultural performances in Georgetown, Guyana
— ANI (@ANI) November 20, 2024
PM Modi is on a 2-day visit to Guyana. During his visit, he will hold a bilateral with President Mohamed Irfaan Ali and will address a special sitting of Guyana's parliament. He will also join… pic.twitter.com/cUoyKPJcir