
- యూఎస్ కంపెనీలకు మోదీ పిలుపు
న్యూఢిల్లీ : ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని యూఎస్ కంపెనీల సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. తమ మూడో టర్మ్‌లో ఇండియాను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు. యూఎస్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా మనదేశం ఉంది. దేశ జీడీపీ 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియా ఎకానమీ గత మూడేళ్లు 7 శాతం వృద్ధి రేటు సాధించి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
యూఎస్ టెక్ కంపెనీల సీఈఓలతో మాట్లాడిన మోదీ, ఇండియాలో ఇన్వెస్ట్ చేసి లాభపడాలని కోరారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి రక్షణ కలిపిస్తామని, కొత్త టెక్ ఇన్నోవేషన్లను ప్రోత్సహిస్తామని అన్నారు. చిప్‌ల తయారీకి ఇండియాను గ్లోబల్‌గా హబ్‌గా మారుస్తామని పేర్కొన్నారు.