మోదీ హై తో ముమ్కిన్ హై!! దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన G20 సమ్మిట్ అద్భుతమైన విజయం సాధించడంతోపాటు, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో సజావుగా సాగిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల్లో డెమీ-గాడ్‌గా మారారు. 2026కి ముందు అమలు చేయలేని మహిళా రిజర్వేషన్ బిల్లును సభలోకి తీసుకురావడం ఒక తెలివైన చర్య.ఎందుకంటే ఇది మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టదు. కానీ, అమలుకు ముందే దాని క్రెడిట్ అంతా ముందుగానే మోదీ ప్రభుత్వం తీసుకుంది.
జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియకు వెళ్లడం తదుపరి ప్రభుత్వానికి చాలా కష్టమైన పని. మోదీ తన ప్రదర్శన ప్రారంభించే ముందే ప్రజలచే చప్పట్లు కొట్టించుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రధాని మోదీ సర్పరైజ్ సంఘటనలకు ప్రసిద్ధి చెందారు. ఇంతకు ముందు డీమోనిటైజేషన్ అంటూ టెలివిజన్లలో కనిపించి అందరినీ షాక్‌కి గురి చేశారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన, దేశవ్యాప్తంగా ముఖ్యంగా జమ్మూ , కాశ్మీర్‌లోని ప్రజలకు షాక్ వేవ్‌లను పంపింది.
ALSO READ :- మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్‌లో ఉత్కంఠ
ఈసారి ఏకకాలంలో ఎన్నికలు ఉంటాయని అందరూ ఊహిస్తున్న వేళ, ఆయన మహిళా రిజర్వేషన్లపై ఓ వార్తతో ముందుకు వచ్చారు. చాలా కాలంగా రాజకీయంగా పెండింగ్‌లో ఉన్న హామీలను నెరవేర్చేందుకు మోదీ ప్రభుత్వం మెల్లగా, నిదానంగా ముందుకు సాగుతోంది.
వేగంగా వాగ్దానాల అమలు
మహిళా రిజర్వేషన్ బిల్లును భవిష్యత్తులో అమలు చేసే తేదీతో తీసుకురావచ్చని ఎవరు ఊహించి ఉండరు? మహిళా బిల్లు కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్‌క్యాష్ అయ్యే లేదా బౌన్స్ అయ్యే చెక్! నిజంగా, మోదీ మాత్రమే అటువంటి ఆలోచనను ఊహించి, దానిని ఖచ్చితత్వంతో అమలు చేయగల సమర్థుడిగా మొత్తం ప్రతిపక్షాలను ఆశ్చర్యపరిచారు. హిందూత్వ ఎజెండాలోని ఏ భాగాన్ని కూడా పెండింగ్‌లో ఉంచడం ప్రధాని మోదీకి ఇష్టం లేదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, ఆర్టికల్ 370 రద్దు వరకు, బీజేపీ ఆవిర్భావం నుంచి చేసిన వాగ్దానాలన్నింటినీ మోదీ నెరవేర్చారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై సర్వత్రా ఆసక్తి
వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే ఎజెండాను ఆయన తుది ముగింపునకు తీసుకెళ్తారా లేదా అనేది కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. స్పష్టమైన కారణాల వల్ల లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని మోదీ తహతహలాడుతున్నారు. తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్న 28 ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి రావడం పట్ల భయాందోళనలో ఉన్న ప్రధాని, ప్రజలను ఆకట్టుకోవడంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు.
విపక్షాలకు బీసీ రిజర్వేషన్ అస్త్రం
జీ20 అతిథులకు ఆహ్వానాలు భారత్ ప్రధాన మంత్రి , రాష్ట్రపతి పంపించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం భారతదేశం పేరును భారత్‌గా మార్చడానికి ప్రయత్నించింది. భారత్, భారతదేశం అనే పదాలు రాజ్యాంగంలో పొందుపరచి ఉన్నందున దాని అర్థం ఏమీ మారదని భావించి ఈ అంశాన్ని ప్రభుత్వం, ప్రతిపక్షాలు హైలైట్ చేయలేదు. మహిళా బిల్లు.. ఓబీసీల రిజర్వేషన్‌ను వదిలిపెట్టింది, దీంతో ప్రతిపక్షాలకు భారీ ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. కాంగ్రెస్ దాని భాగస్వామ్య పక్షాలు కూడా రిజర్వేషన్లను డిమాండ్ చేయడానికి తొందరపడ్డాయి. సమాజంలోని ఈ అణగారిన వర్గాలను ఆకట్టుకోవడానికి మోదీ తదుపరి అడుగు ఏవిధంగా ఉంటుందో చూడాలి. ఏదైనా చేయగల సమర్థుడుగా భావించే మోదీకి పెద్దదైన లైఫ్ ఇమేజ్ ఉన్నా, 2024లో లోక్‌సభ ఎన్నికల్లోనే మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఆయన ఇప్పుడే ప్రకటించి ఉంటే మొత్తం ఎంపీలు టికెట్ల ఆరాటంలో పడి ఉండేవారు. ఈ చర్య మొత్తం ప్రతిపక్షాలను షాక్ పంపించి ఉండేది. ఇది వైస్ వెర్సా ఎన్డీయేకి లాభదాయకంగా ఉండేది. అయినప్పటికీ చాలా సందర్భాల్లో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ను సృష్టించడం నాయకుడికి, అతని పార్టీకి సహాయపడుతుంది, కానీ కొన్నిసార్లు అది బూమరాంగ్ కూడా కావచ్చు.
ప్రజాకర్షణే బలం
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాకర్షణ , విజయం సాధించగల సామర్థ్యం చాలా బలంగా ఉంది. కాబట్టి ఆయన వైఫల్యాల గురించి ఎవరూ ఆలోచించలేరు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌లను నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలి. అలాగైతేనే ప్రజలు ఏ సమస్యలపైనా ఉలిక్కిపడటం కనిపించదు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశంపై, ప్రజలు ఇప్పుడు కమిటీ నిర్ణయం కోసం వేచి ఉన్నారు. ఈ అంశాన్ని 2026 నాటి డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత జరిగే అమలుకు వదిలేశారు.
17వ లోక్‌సభలో ముఖ్యమైన చట్టాలన్నీ అమల్లోకి వస్తే, ప్రధాని మోదీ, ఆయన బృందం తదుపరి పదవీకాలంలో ఏం చేస్తారు? తన కట్టుబాట్లలో చిత్తశుద్ధి , అసంపూర్తిగా ఉన్న తన ఎజెండాను ఎలా పూర్తి చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు అని అది దేశానికి తెలియాలని ప్రధాని కోరుకుంటున్నారు.
వివాదాస్పద అంశాలని పరిష్కరించాలి
28 ప్రతిపక్ష పార్టీల కూటమి, తమ నాయకుడిపై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సున్నితమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లీడర్‌కు ఉండాలి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ , మహిళా రిజర్వేషన్ బిల్లు యొక్క ప్రధాన సమస్యలతో పాటు, యూనిఫాం సివిల్ కోడ్‌పై మోదీ ఇంకా చర్య తీసుకోలేదు. మూడు అంశాలు వివాదాస్పదమైనవి, కానీ నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు. వాటిని తార్కిక ముగింపునకు తీసుకువెళతారు. ఇప్పుడు కాకపోతే వచ్చే 18వ లోక్‌సభలో మోదీ
సా ధించి తీరతారేమో కానీ.. అంతకంటే ముందే హ్యాట్రిక్ సాధించాలని ఆయన కోరుకుంటున్నారు. జనాలకు ప్రధానమంత్రి మోదీపై పూర్తి విశ్వాసం ఉన్నట్టుంది.