
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోమవారం ట్రంప్ కు మోదీ ఫోన్ చేసి అభినందనలు చెప్పారు.
అమెరికా, భారత్ మధ్య పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. అమెరికాకు ఇండియా నమ్మకమైన భాగస్వామి అని చెప్పారు. ‘‘రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ కు కంగ్రాట్స్ చెప్పేందుకు చాలా ఆనందిస్తున్నా.
ఇద్దరం ఇరు దేశాల సంక్షేమం కోసం పనిచేస్తాం. ప్రపంచ శాంతి, అభివృద్ధి, భద్రత కోసమూ పాటుపడతాం” అని మోదీ ట్వీట్ చేశారు. కాగా.. ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత ఇద్దరి మధ్య జరిగిన తొలి టెలిఫోనిక్ సంభాషణ ఇదే.