చెస్‌‌ చాంపియన్లతో మోదీ ముచ్చట్లు

చెస్‌‌ చాంపియన్లతో మోదీ ముచ్చట్లు
  •     ప్రధాని ముందు ఎత్తులు వేసిన అర్జున్‌‌, ప్రజ్ఞానంద
  •     విజేతలకు ఏఐసీఎఫ్‌‌ రూ. 3.2 కోట్ల రివార్డు

న్యూఢిల్లీ :  చెస్‌‌‌‌‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌తో మెరిసిన ఇండియా చెస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. బుధవారం తన నివాసంలో ప్లేయర్లకు ఆతిథ్యం ఇచ్చిన మోదీ వారితో   ముచ్చటించారు. ప్రతి ఒక్కరితో కలిసి ఫొటోలు దిగారు. ఆ తర్వాత టోర్నీకి సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లేయర్లు చెస్‌‌‌‌‌‌‌‌ బోర్డును ప్రధానికి బహుకరించారు. తర్వాత ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌, ప్రజ్ఞానంద, మోదీ సమక్షంలో చెస్‌‌‌‌‌‌‌‌ ఆడారు. 

వీరిద్దరు చకచకా ఎత్తులు వేయడాన్ని చూసిన ప్రధాని మంత్రముగ్దులయ్యారు. కాగా, మోదీని కలిసేందుకు విదిత్‌‌ సంతోష్‌‌ అజర్‌‌‌‌బైజాన్‌‌లో  జరిగే ఓ టోర్నీ నుంచి విత్‌‌డ్రా చేసుకొని మరీ  రావడం విశేషం. కాగా, చరిత్రాత్మక విజయం సాధించిన ఇండియా ప్లేయర్లకు ఆలిండియా చెస్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (ఏఐసీఎఫ్‌‌‌‌‌‌‌‌) రూ. 3.2 కోట్ల క్యాష్‌‌‌‌‌‌‌‌ రివార్డును ప్రకటించింది. 

ప్రతి ప్లేయర్‌‌‌‌‌‌‌‌కు రూ. 25 లక్షలు, కెప్టెన్లు చెరో రూ. 15 లక్షలు అందుకోనున్నారు. ఇండియన్‌‌‌‌‌‌‌‌ బృందం హెడ్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ దిబేందు బారుకు రూ. 10 లక్షలు, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌లకు రూ. 7.5 లక్షలు ఇవ్వనున్నారు.