టీమిండియాకు ప్రధాని మోదీ అభినందన ‌‌‌‌

టీమిండియాకు ప్రధాని మోదీ అభినందన ‌‌‌‌
  • 7 నెలల కిందటి గాయం మానింది..
  • 13 ఏండ్ల  పోరాటం ఫలించింది.. 
  • 17 ఏండ్ల కిందట దక్కిన తొలి పొట్టి కప్‌‌‌‌‌‌‌‌ మరోసారి ఒళ్లో వాలింది..!
  • తృటిలో వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ చేజారిపోయిందని బాధపడిన సగటు అభిమాని ఆవేదన ఎట్టకేలకు తీరింది..!

అప్పుడెప్పుడో 2011లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గి ధోనీసేన ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించినా దొరకని మెగా ట్రోఫీని ఎట్టకేలకు రోహిత్‌‌‌‌‌‌‌‌ బృందం సగర్వంగా అందుకుంది..!
 నెగ్గిన కప్‌‌‌‌‌‌‌‌లో తేడా ఉండొచ్చేమో గానీ.. టీమిండియా ఆట మాత్రం సేమ్‌‌‌‌‌‌‌‌ టు సేమ్‌‌‌‌‌‌‌‌..! 

ఆస్ట్రేలియా అహం అణిచాం.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను ఇరగదీశాం.. చివర్లో సౌతాఫ్రికా బెట్టు చేసినా ఆఖర్లో అద్భుతం చేసిన మన బౌలర్లు నాలుగో వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌తో త్రివర్ణాన్ని రెపరెపలాడించారు..! ఫలితంగా జయహో టీమిండియా.. అంటూ అభిమానుల జయజయ ధ్వానాల మధ్య సగటు భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగి పోయింది..! ఈ సంతోషాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించకముందే కింగ్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ టీ20లకు గుడ్‌‌‌‌‌‌‌‌ బై చెబుతున్నట్లు ప్రకటించి అభిమానులకు కాస్త నిరాశ కలిగించాడు..! 

టీమిండియాకు ప్రధాని మోదీ అభినందన ‌‌‌‌

టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘మన టీమ్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ను తమదైన స్టైల్‌‌‌‌లో ఇంటికి తీసుకువస్తోంది. టీమిండియాను చూసి గర్విస్తున్నాం. ఈ మ్యాచ్‌‌‌‌ చరిత్రాత్మకం’ అని ట్వీట్‌ చేశారు.