ఎన్టీపీసీ 800 మెగావాట్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌ జాతికి అంకితం.. రామగుండంలో తిలకించిన ప్రముఖులు

గోదావరిఖని/ జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా నిర్మించిన ఎన్టీపీసీ తెలంగాణ 800 మెగావాట్ల తొలి ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ వేదికగా మంగళవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రముఖులు తిలకించారు. ఎన్టీపీసీ జీఎంలు ఏకే దేశాయ్‌‌‌‌‌‌‌‌, మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి జిల్లా అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్యామ్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌, ఏసీపీ శ్రీనివాసరావు, సింగరేణి ఆర్జీ 1  ఏరియా జీఎం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఐఎన్‌‌‌‌‌‌‌‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు సలీంపాష, బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ వడ్డేపల్లి రాంచందర్‌‌‌‌‌‌‌‌, తదితరులు వీక్షించారు. 

ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లోని యూనిట్‌‌‌‌‌‌‌‌లో కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 28 తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. విజయవంతంగా విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి కొనసాగుతుండడంతో ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు.