ప్రధాని మన్ కీ బాత్.. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక

ప్రధాని మన్ కీ బాత్.. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి  ప్రతీక
  • కుంభమేళాపై మన్ కీ బాత్​లో ప్రధాని మోదీ
  • యువత భాగస్వామ్యం శుభసూచకం
  • ఇస్రో సైంటిస్టులకు అభినందనలు

న్యూఢిల్లీ: మహాకుంభ మేళాలో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా అందరూ ఆధ్యాత్మిక పండుగలో పాల్గొనాలని కోరారు. మహాకుంభ మేళా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని తెలిపారు. 

ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిందని అన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ నెల చివరి ఆదివారం ఛబ్బీస్ జనవరి కావడంతో 118వ మన్ కీ బాత్ ఎపిసోడ్​ను మూడో ఆదివారమే ప్రసారం చేశారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘మహాకుంభ మేళాలో అత్యధిక సంఖ్యలో యువత పాల్గొనడం సంతోషంగా ఉన్నది. వాళ్లంతా ఆచార వ్యవహారాలు తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడ్తాయి. 

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి ఎంతో ఆదరణ లభిస్తున్నది. ఇది ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం. ఈ నెల 11న వచ్చిన పుష్య శుక్ల ద్వాదశి రోజున.. రామ్​లల్లా ‘ప్రాణ ప్రతిష్ఠ పర్వ్’ తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. లక్షలాది మంది భక్తులు రామ్​లల్లాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు’’అని తెలిపారు.

ఈ రిపబ్లిక్ డే ఎంతో ప్రత్యేకం

ఈ రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాదితో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతుందని తెలిపారు. ‘‘మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ తలవంచి నమస్కరిస్తున్నాను. 

2025ను ఇస్రో ఎంతో ఘనంగా ప్రారంభించింది. స్పేడెక్స్ మిషన్ సక్సెస్ చేసినందుకు సైంటిస్టులు, ఇంజినీర్లందరికీ అభినందనలు. ఈ విజయం.. మన ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సరికొత్త ఆవిష్కరణలకు ఇది సింబల్​గా నిలుస్తుంది. 

స్పేస్ సెక్టార్ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. స్పేస్​లో పంటలు పండించడంపై కూడా మన ఇస్రో సైంటిస్టులు ప్రయోగాలు చేయడం సంతోషకరం’’ అని మోదీ కొనియాడారు. 

స్టార్టప్​ల వైపు యువత పరుగులు

ప్రజల శక్తిని బలోపేతం చేసేందుకు ఎలక్షన్ కమిషన్..సాంకేతిక శక్తిని ఉపయోగిం చిందని ప్రధాని  మోదీ అన్నారు. ఈ సందర్భం గా ఈసీ పనితీరుపై ఆయన ప్రశం సలు కురిపిం చారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి, పటిష్టం చేస్తున్నదని కొనియా డారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నదని తెలిపారు. 

‘‘ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం. ఆ రోజు ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఆ రోజు స్థాపించారు. మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల సంఘానికి, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి రాజ్యాంగంలో చాలా కీలక స్థానం ఇచ్చారు. 

యువత స్టార్టప్ కంపెనీల వైపు ఆకర్షితుల వుతున్నారు. దీంతో స్టార్టప్ ఇండియా రూపుదిద్దుకుంటున్నది. సమాజంలో పరిస్థితు లు మారిపోతున్నాయి. దేశం డిజిటల్‌ యుగం లోకి ప్రవేశిస్తున్నది’’అని మోదీ అన్నారు.