
సిక్కు క్యాడెట్ తలపాగా పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్గా కన్పించారు. ఢిల్లీలోని కరియప్పా గ్రౌండ్‌లో శుక్రవారం నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్‌సీసీ) ర్యాలీ జరిగింది. దీనికి ప్రధాని హాజరై మార్చ్ఫాస్ట్ను సమీక్షించారు. ఉత్తమ క్యాడెట్లకు పతకాలు, లాఠీలు అందజేశారు. తర్వాత మాట్లాడుతూ.. తాను కూడా ఎన్సీసీలో యాక్టివ్గా పాల్గొన్నానని, దేశానికి సేవ చేయడంలో ఆనందం ఉంటుందని అన్నారు. స్టూడెంట్ దశ నుంచే దేశ సేవలో పాల్గొనడం అదృష్టమని చెప్పారు. ఎన్‌సీసీ బలోపేతానికి కేంద్ర సర్కారు కట్టుబడి ఉందన్నారు.