దేశ ప్రజల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉంది: ప్రధాని మోదీ

దేశ ప్రజల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉంది:  ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: చట్ట సభల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అని, దేశంలో పెట్టుబడులకు బూస్ట్లా పనిచేస్తుందని ప్రధాని కొనియాడారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

భారతదేశ కలలను బడ్జెట్ సాకారం చేస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ బడ్జెట్ లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, తయారీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని మోదీ చెప్పారు. ఇది నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. పొదుపు, పెట్టుబడులకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని ఆయన చెప్పారు.

ALSO READ | Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

బడ్జెట్ అనగానే ప్రభుత్వ ఖజానాను నింపుకునే మార్గాలను అన్వేషించే విధంగా ఉంటుందని.. కానీ ఈ బడ్జెట్ అందుకు పూర్తి భిన్నమైందని మోదీ చెప్పుకొచ్చారు. దేశ పౌరుల ఖాతాల్లోని సేవింగ్స్ను పెంచే విధంగా బడ్జెట్ ఉందని, దేశాభివృద్ధిలో దేశ పౌరులను భాగస్వామ్యులను చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ప్రధాని మోదీ తెలిపారు.

న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ప్రైవేట్ సెక్టార్ను ప్రోత్సహించేలా బడ్జెట్ ఉండటం చారిత్రక పరిణామమని చెప్పారు. దేశంలో టూరిజం రంగాన్ని ప్రోత్సహించేలా బడ్జెట్ నిర్ణయాలు ఉన్నాయని, ఉపాధిని పెంపొందించడంలో టూరిజం రంగం కీలక పాత్ర పోషించేందుకు ఈ పరిణామం ఎంతగానో కలిసొస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

#WATCH | On Union Budget 2025, Prime Minister Narendra Modi says "Today is an important milestone in India's development journey. This is the budget of aspirations of 140 crore Indians. This is a budget that fulfils the dreams of every Indian. We have opened many sectors for the… pic.twitter.com/qvEVYlVzj8