కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిల్వర్ సిటీ చేస్తాం : ప్రధాని మోదీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను సిల్వర్ సిటీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ప్రసిద్ధి చెందిన ఫిలిగ్రీ కళను మన్ కీ బాత్‌‌‌‌లో కూడా తాను ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. స్వర్ణకారులు, కళాకారుల కోసం పీఎం విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టామని, దీని ద్వారా ఇక్కడి ఫిలిగ్రీ కళాకారులకు ఆధునిక శిక్షణ, రుణం లభిస్తుందన్నారు. 

సోమవారం కరీంనగర్ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్ ​కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన జిల్లా ప్రత్యేకతను వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం నిధులు ఇచ్చిందన్నారు. సంజయ్ సూపర్ ఫాస్ట్... మీరు కూడా సూపర్ ఫాస్ట్ గా మారి ఆయనను  అందుకోవాలంటూ ప్రజలకు కోరారు.  సభలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వికాస్ రావు(వేములవాడ) , బొడిగ శోభ(చొప్పదండి), ఆరేపల్లి మోహన్(మానకొండూరు), బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి(హుస్నాబాద్), రాణిరుద్రమ(సిరిసిల్ల) పాల్గొన్నారు.  

సభ సక్సెస్.. క్యాడర్‌‌‌‌‌‌‌‌లో ఫుల్​జోష్

 పీఎం నరేంద్రమోదీ తొలిసారి కరీంనగర్ రావడంతో ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభలో కుర్చీలు నిండిపోవడంతో స్థలం చాలక ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇంకోవైపు సంజయ్ సభలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగానికి జనం ఫిదా అయ్యారు, మోదీ పేరును ప్రస్తావించినప్పుడల్లా ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. సభ సక్సెస్ కావడంతో క్యాడర్ లో జోష్ నెలకొంది. 

గెలిపిస్తే రక్షణ కవచంగా మారుతా

పేదల కోసం కష్టపడి పనిచేసిన తనలాంటోళ్లను గెలిపించకపోతే... పేదల కోసం ఎందుకు కొట్లాడాలని కార్యకర్తలు ప్రశ్నిస్తే తానేం సమాధానం చెప్పాలని బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. 'మీరు ఎంపీగా గెలిపించిన నేను ఒకప్పుడు ఒక సామాన్య కార్యకర్త.. నమ్మిన సిద్దాంతం, కమల వికాసం కోసం  ఇదే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ కార్యక్రమాల పోస్టర్లను గోడలకు అంటించిన..' అని భావోద్వేగంతో చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏండ్లు మీకు సేవ చేసుకుంటానని, కరీంనగర్ కు రక్షణ కవచంగా నిలుస్తా' అని అన్నారు.