మోదీ టూర్‍కు వరంగల్ ముస్తాబు

  • రేపు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో బహిరంగ సభ 
  • మొదట భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని
  • సిటీలో రెండున్నర గంటలు ఉండనున్న మోదీ
  • 10 వేల మందితో భారీ భద్రత!
  • హనుమకొండ చుట్టూ 20 కిలోమీటర్లు నో ఫ్లై జోన్‍

రేపు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో బహిరంగ సభ 

వరంగల్‍, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఓరుగల్లు ముస్తాబైంది. శనివారం ప్రత్యేక హెలీకాప్టర్​లో మామునూర్ ఎయిర్​పోర్ట్​లో దిగనున్న ప్రధాని.. ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో రూ.6,100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి, అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభను విజయవంతం చేసేందుకు బీజేపీ లీడర్లు కసరత్తు చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో 5 లక్షల జనసమీకరణే లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వరంగల్​లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

పీఎం సెక్యూరిటీ చూసే స్పెషల్‍ ప్రొటెక్షన్‍ గ్రూప్‍ (ఎస్‍పీజీ)తో పాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్‍ ఆఫీసర్లు ఇక్కడే మకాం వేసి బందోబస్త్ ఏర్పాట్లు చూస్తున్నారు. ఇప్పటికే ఎస్‍పీజీ బలగాలు సభాస్థలిని తమ కంట్రోల్ లోకి తీసుకున్నాయి. గురువారం గ్రేహౌండ్స్, ఆక్టోపస్‍ అడిషనల్‍ డీజీపీ విజయ్‍, పలువురు అధికారులతో సెక్యూరిటీపై రివ్యూ చేశారు. హనుమకొండ, వరంగల్‍ సిటీల చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్​గా ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ అంతా 144 సెక్షన్‍ విధించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‍ మళ్లింపు చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్​ నుంచి వరంగల్​కు

మోదీ తన వరంగల్‍ పర్యటనలో రెండున్నర గంటలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 7.35 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి 9.25 గంటలకు హైదరాబాద్‍ లోని హకీంపేట ఎయిర్‍పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‍ ద్వారా 10.15 గంటలకు  వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ లో దిగుతారు. వరంగల్‍ భద్రకాళి అమ్మవారి ఆలయానికి  చేరుకుంటారు. పూజలో పాల్గొని 11 గంటలకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్‍ సైన్స్ కాలేజీ వస్తారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొంటారు. తర్వాత 11.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సభలో ప్రసంగిస్తారు. తిరిగి మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ చేరుకుని 12.55 గంటలకు హైదరాబాద్‍ హకీంపేట ఎయిర్‍పోర్ట్ కు తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి 
రాజస్థాన్​కు వెళ్తారు.

రూ.6,100 కోట్ల పనులకు శంకుస్థాపన

రూ.6,100 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.5,550 కోట్ల విలువ చేసే 176 కిలో మీటర్ల నేషనల్ హైవేలు ఇందులో ఉన్నాయి. 108 కిలో మీటర్లు మంచిర్యాల, వరంగల్‍ మీదుగా వెళ్లే నాగ్​పూర్‍–విజయవాడ ఎన్‍హెచ్‍ 45 కారిడార్‍తో పాటు ప్రస్తుతం ఉన్న కరీంనగర్‍–వరంగల్ 68 కిలో మీటర్ల ఎన్‍హెచ్ 65 డబుల్​లైన్ రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా డెవలప్‍ చేసే పనులకు భూమిపూజ చేయనున్నారు. దీంతోపాటు మరో రూ.500 కోట్లకు పైగా నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట రైల్వే వ్యాగన్‍ మాన్యుఫ్యాక్చరింగ్‍ యూనిట్‍కు శంకుస్థాపన చేస్తారు.

ఇయ్యాల వరంగల్​కు కిషన్​రెడ్డి

వరంగల్ సభను విజయవంతం చేసేందుకు కిషన్‍రెడ్డి కసరత్తు చేస్తున్నా రు. సభకు 5 లక్షల మందిని తరలించం లక్ష్యంగా కేడర్‍కు దిశానిర్దేశం చేస్తున్నా రు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన వరంగల్‍ చేరుకోనున్నారు. ఇక్క డే ఉండి ఏర్పాట్లు, జనసమీకరణ కార్యక్ర మాలను పర్యవేక్షించనున్నారు. దాదాపు 500 మంది అఫిషియల్స్ పాల్గొనేలా రెయిన్​ప్రూఫ్ వేదిక ఏర్పాటు చేస్తున్నారు.