ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టనున్న రూ. 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుల్లో వైజాగ్ రైల్వే జోన్ కు సంబంధించిన ఏడు రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.6,177 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. రూ.1,877 కోట్లతో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించనున్నారు. అలాగే, రూ. 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులు చేపట్టనున్నారు.
హైదరాబాద్, వెలుగు : ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురింపించారు. బుధవారం ఆయన వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2.08,545 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులో వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించిన ఏడు రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.6,177 కోట్లతో ఈ ప్రాజెక్టు చేప ట్టనున్నారు. రూ.1,877 కోట్లతో నక్కపల్లిలో బల్క్ డ్రగ్పార్క్ నిర్మించనున్నారు. అలాగే, రూ.4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులు, రూ.3,044 కోట్లతో నిర్మించే 234 కిలోమీటర్ల పొడవైన ఏడు నేషనల్ హైవేస్ పనులకూ మోదీ శంకుస్థాపన చేశారు.
అనంతరం వైజాగ్ సిటీలో మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని
మాట్లాడారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ఆయన.. ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.
60 ఏళ్ల తర్వాత దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం అవుతుందన్నారు. వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్ రాకతో వ్యవసాయంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.