న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 21 వరకు నైజీరియా, గయానా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే బ్రెజిల్ వేదికగా జరగనున్న జీ-20 సదస్సుకు హజరుకానున్నారు. ముందుగా నైజీరియా చేరుకుని ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టింబుతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ బలోపేతం, ఎనర్జీ, భద్రత రంగాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
రెండు రోజుల పర్యటన అనంతరం బ్రెజిల్లో జరిగే జీ20 సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ అంశాలపై భారత్ వైఖరి ఏంటో ప్రకటించనున్నారు. అనంతరం ఈనెల 21 వరకు గయానాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఆ దేశ పార్లమెంట్లో మోదీ ప్రసంగిస్తారు. కరికోమ్- ఇండియా సదస్సుకు హాజరుకానున్నారు.