హైదరాబాద్, వెలుగు: దేశంలోని బీజేపీ కార్యకర్తలు, నేతలు, నాయకులతో మాట్లాడేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘‘నా పోలింగ్ బూత్ అన్నిటి కన్నా శక్తివంతమైంది(మేరా బూత్ సబ్‌సే మజ్బూత్)’’కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు మోదీ ప్రసంగాన్ని చూసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది.
ALSO READ:ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
బూత్ స్థాయిలో టీవీ, మొబైల్ ఫోన్, పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పార్టీ విధివిధానాలపై, కార్యకర్తల బాధ్యతలపై, వారు చేసే సేవా పనులు సహా పలు అంశాలపై మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 వేల పోలింగ్ బూత్‌లు ఉండడంతో, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, పోలింగ్ బూత్‌ల స్థాయిలో పార్టీ బాధ్యతల్లో ఉన్న బీజేపీ నాయకులు మోదీ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.