ట్రైబల్ ఏరియాల్లో మల్టీ పర్పస్ సెంటర్లు

  • రేపు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని
  • ఈ కేంద్రాల్లో అంగన్ వాడీ, పీహెచ్ సీ, స్కూల్, స్కిల్ సెంటర్
  • పీఎం జన్​ మన్ కింద రాష్ట్రానికి 49 కేంద్రాలు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: పీఎం జన్​మన్​ స్కీం లో భాగంగా రాష్ట్రంలోని ట్రైబల్ ఏరియాల్లో నిర్మాణం పూర్తయిన ఏడు మల్టీ పర్పస్ సెంటర్లను ఈ నెల 15న బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్టేట్ ట్రైబల్ శాఖకు అధికారిక సమాచారం అందింది.  రాష్ట్రంలోని ఉట్నూరు, ఆదిలాబాద్, అసిఫాబాద్, నాగర్ కర్నూల్​ జిల్లాల్లో ఐటీడీఏ పరిధిలో మొత్తం 49 మంజూరు కాగా ఏడు పూర్తయినట్లు, మిగతా 42 నిర్మాణ దశలో ఉన్నట్లు ట్రైబల్ అధికారులు చెబుతున్నారు. 

ఒక్కో సెంటర్​ను రూ.60 లక్షల వ్యయంతో పీఎం జన్​మన్​లో భాగంగా కేంద్ర నిధులతో నిర్మించారు. ఈ సెంటర్ లో నాలుగు రూమ్స్, ఒక హాల్ ఉండగా ఇందులో అంగన్ వాడీ కేంద్రం, పీహెచ్ సీ, ప్రైమరీ స్కూల్, స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ ఈ సెంటర్లను కేటాయించినా తెలంగాణలోనే వాటి నిర్మాణం పూర్తయిందని ట్రైబల్ అధికారులు చెబుతున్నారు.