అక్టోబర్ 22 నుంచి రెండ్రోజులు..మోదీ రష్యా టూర్

  • బ్రిక్స్ సమిట్​లో పాల్గొనాలని ఆహ్వానించిన పుతిన్  

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్నారు. మాస్కోలో వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ సమిట్ లో పాల్గొననున్నారు. ఈమేరకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాలోని కజన్ లో16వ బ్రిక్స్ సమిట్ జరగనుంది. 

దీనిలో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈ నెల 22 -23 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 

ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని పేర్కొంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో ఆరుసార్లు పర్యటించారు. 2015లోనే  రెండు సార్లు విజిట్ చేశారు.