ముందుగానే వచ్చేస్తున్న మోదీ.. 30వ తేదీనే మహబూబ్ నగర్ సభ

ముందుగానే వచ్చేస్తున్న మోదీ.. 30వ తేదీనే మహబూబ్ నగర్ సభ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముందుకు జరిగింది. అక్టోబర్ 2వ తేదీ అనుకున్నా.. ఇప్పుడు ఆ టూర్ ముందుకు జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీనే తెలంగాణకు వస్తున్న మోదీ.. మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 30న మహబూబ్ నగర్ టౌన్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ సభకు చేరుకోనున్నారు. ప్రధాని సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.

Also Read : ఖేలో ఇండియాతో దేశంలో క్రీడాభివృద్ది : ప్రధాని మోదీ

బహిరంగ సభను చాలా ప్రతిష్టత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా జన సమీకరణపై దృష్టి పెట్టారు. సభా ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ రాష్ర్టంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.