ఘనంగా నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు

ఘనంగా నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు

బోధన్​,వెలుగు: బీజేపీ పట్టణ శాఖ​ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆఫీసులో కేట్​ కట్ చేసి ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  గవర్నమెంట్​ హాస్పిటల్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు.   కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు  కొలిపాక బాలరాజు,  జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, మాజీ కౌన్సిలర్ లు  రామరాజు, ధర్మపురి , బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్, వాసు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. 

కామారెడ్డిటౌన్​, వెలుగు:  ప్రధాని నరేంద్రమోడీ  జన్మదినం పురస్కరించుకొని  మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.   జిల్లా హాస్పిటల్​లో  పలువురు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు రక్తదానం చేశారు.  కార్యక్రమంలో   పార్టీ జిల్లా జనరల్​ సెక్రటరీలు నరేందర్​రెడ్డి, రవీందర్​రావు  తదితరులు పాల్గొన్నారు. 
నిజామాబాద్​, వెలుగు: ప్రధాని మోడీ జన్మదిన వేడుకలను మంగళవారం బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా ఆఫీస్​లో ఏర్పాటు చేసిన శిబిరంలో లీడర్లు, కార్యకర్తలు రక్తదానం చేశారు. జీజీహెచ్​ హాస్పిటల్​లో రోగులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు.  అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​, పల్లె గంగారెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.