ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో మరోసారి మార్పులు జరిగాయి. సెప్టెంబరు 30వ తేదీకి బదులు అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మహబూబ్ నగర్ కు రానున్నారు ప్రధాని మోదీ. అక్టోబరు 1న మహబూబ్ నగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
అక్టోబరు 1న బీజేపీ భారీ బహిరంగసభను మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ ఐటీఐ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా బీజేపీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
బహిరంగ సభను చాలా ప్రతిష్టత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మందిని సభకు తరలించేలా జన సమీకరణపై దృష్టి పెట్టారు. సభా ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలు జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.