ఓ ప్రతిపక్ష నేత నన్ను సంప్రదించారు: నితిన్‌గడ్కరీ
నాగ్‌పూర్: ప్రధానమంత్రి పదవి తన జీవిత లక్ష్యం కాదని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. తాను ప్రధాని రేసులో ఉంటే మద్దతిస్తానని ఓ ప్రతిపక్ష నేత ఆఫర్చేస్తే సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డు ఫంక్షన్లో గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ‘‘నాకు ఒక సంఘటన గుర్తుంది. నేను అతను పేరు చెప్పను. కానీ.. నేను ప్రధాని అభ్యర్థిగా నిల్చుంటే మద్దతు ఇస్తానని ఆ ప్రతిపక్ష నేత ఆఫర్ ఇచ్చారు.” అని తెలిపారు.
అయితే.. ‘‘మీరు ఎందుకు నాకు మద్దతు ఇస్తారు? నేను మీ మద్దుతు ఎందుకు తీసుకోవాలి” అని ఆ లీడర్‌ను తాను ప్రశ్నించినట్టు గడ్కరీ చెప్పారు. తాను తన పార్టీకి విధేయుడినని, తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.