SRH vs LSG: అయ్యో ఇంత బ్యాడ్ లక్ ఏంటి: క్లాసన్ ఔట్‌తో తలపట్టుకున్న కావ్య మారన్

SRH vs LSG: అయ్యో ఇంత బ్యాడ్ లక్ ఏంటి: క్లాసన్ ఔట్‌తో తలపట్టుకున్న కావ్య మారన్

ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్ చివరి బంతిని ప్రిన్స్ యాదవ్ ఆఫ్ సైడ్ వేశాడు. ఈ బంతిని నితీష్ కుమార్ రెడ్డి స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. బంతిని బలంగా కొట్టడంతో వేగంగా వస్తున్న క్యాచ్ కు అందుకోవడంలో ప్రిన్స్ విఫలమయ్యాడు. అయితే క్యాచ్ మిస్ అయిందని సంతోషించే లోపు బాల్ వెళ్లి నాన్ స్ట్రైకింగ్ లో వికెట్లకు తగిలింది. నాన్ స్ట్రైకింగ్ లో బ్యాటింగ్ చేస్తున్న క్లాసన్ అప్పటికే క్రీజ్ బయట ఉన్నాడు. దీంతో క్లాసన్ రనౌట్ రూపంలో ఔట్ కావాల్సి వచ్చింది. 

అప్పటికే 17 బంతుల్లో 26 పరుగులు చేసి క్రీజ్ లో కుదురుకున్న క్లాసన్ ఔట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తల పట్టుకొని తీవ్ర నిరాశకు గురైంది. కావ్య మారన్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్లాసన్ ఔట్ కావడంతో సన్ రైజర్స్ స్కోర్ వేగం బాగా మందగించింది. ఆ తర్వాత వచ్చిన వారు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్ పై కనీసం 200 పరుగులు అయినా చేయలేకపోయారు. 

Also Read : లక్నోపై దంచికొట్టిన SRH.. రిషబ్ సేన టార్గెట్ ఎంతంటే..?

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32) యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ (36) రాణించగా.. మిగితా బ్యాటర్లు విఫలం అయ్యారు. స్టార్ బ్యాటర్ క్లాసెన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. చివర్లో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ 13 బంతుల్లో 5 సిక్సుర్లు బాది మెరుపు ఇన్సింగ్స్ ఆడగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 18 పరుగులు చేశాడు.