చత్తార్పూర్: స్కూల్ ప్రిన్సిపాల్ పై12వ తరగతి స్టూడెంట్ కాల్పులు జరపడంతో ఆయన స్పాట్ లోనే మరణించారు. శుక్రవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ చత్తార్ పూర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. దమోరా గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ కు ఎస్ కే. సక్సేనా ఐదేండ్లుగా ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు.
అదే స్కూల్ కు చెందిన12వ తరగతి విద్యార్థి తన సహచరుడితో కలిసి ప్రిన్సిపాల్ పై టాయిలెంట్ఎంట్రన్స్ వద్ద కాల్పులు జరపడంతో ఆయన చనిపోయారు. అనంతరం నిందితుడు, అతడి సహచరుడు ప్రిన్సిపాల్ స్కూటర్ తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని ఈ ఘటనపై కేసును నమోదు చేశారు.