
ప్రకాశం: చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) వలకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రవీణ్ కుమార్ పని చేస్తోన్న ప్రిన్సిపాల్.. అదే కాలేజీలో పని చేసే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్లుపై సంతకం పెట్టేందుకు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీని ఆశ్రయించాడు. ఉద్యోగి నుంచి లంచం డిమాండ్ చేసిన అవినీతి ప్రిన్సిపాల్ భరతం పట్టేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ డిమాండ్ చేసిన రూ.17,500 ఉద్యోగికి ఇచ్చి పంపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నుంచి ప్రిన్సిపాల్ రూ.17,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ప్రవీణ్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.