ముథోల్​లోని గురుకుల ప్రిన్సిపల్​పై సస్పెన్షన్ వేటు

ముథోల్, వెలుగు:  ముథోల్​లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ ప్రిన్సిపల్​పై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రిన్సిపల్ రఫీ ఉద్దీన్ తమతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, పరుష పదజాలం వాడుతున్నారని ఈ నెల 5న అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. తమను దూషిస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

గతంలో పనిచేసిన చోట ఇదే తరహాలో వ్యవహరించడంతో అక్కడ సస్పెన్షన్ కు గురై, ముథోల్​కు వచ్చి ఇక్కడా అదే తీరును కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ప్రిన్సిపల్ రఫీ ఉద్దీన్ పై సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి నవీన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఫలితంగా మంగళవారం ఇన్​చార్జ్​ ప్రిన్సిపల్​గా అమృతయ్య బాధ్యతులు స్వీకరించారు.