రూ.29వేల లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన విక్టోరియా ప్రిన్సిపాల్

రూ.29వేల లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన విక్టోరియా ప్రిన్సిపాల్
  • లంచం తీసుకుంటుండగా పట్టివేత

ఎల్బీనగర్, వెలుగు:కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రెడ్ హ్యాండెడ్​గా ఏసీబీకి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. విక్టోరియా స్కూల్​విద్యార్థులకు భోజ నం సరఫరా చేయడానికి ఒక వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇటీవల బిల్లులు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ ప్రభుదాస్​ను సదరు కాంట్రాక్టర్ కోరాడు. 

భోజన బిల్లులను అధిక మొత్తానికి వేస్తానని, ఎక్కువగా వేసిన నగదును తనకు ఇవ్వాలని షరతు పెట్టాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. అధిక మొత్తానికి వచ్చిన బిల్లు రూ.29 వేలను సదరు కాంట్రాక్టర్ దగ్గర ప్రిన్సిపాల్ తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

నగదును స్వాధీనం చేసుకుని, ప్రిన్సిపాల్ ప్రభుదాస్​ను అదుపులోకి తీసుకున్నారు.