అడ్వాన్స్​టెక్నాలజీ సెంటర్ ద్వారా ట్రైనింగ్ : సంజయ్ ​కుమార్

అడ్వాన్స్​టెక్నాలజీ సెంటర్ ద్వారా ట్రైనింగ్ : సంజయ్ ​కుమార్

కోల్ బెల్ట్, వెలుగు: అడ్వాన్డ్స్​ టెక్నాలజీ సెంటర్ల ద్వారా స్టూడెంట్లకు అధునాతన కోర్సుల్లో ట్రైనింగ్​ ఇచ్చేందుకు ప్రభుత్వం​ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ ​కుమార్​అన్నారు. టాటా టెక్నాలజీ కంపెనీ, సర్కార్ సంయుక్తంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో నిర్మిస్తున్న ఏటీసీ సెంటర్ ను మంగళవారం ఆయన పరిశీలించారు. సెంటర్​ నిర్మాణ పనులు, స్టూడెంట్లకు అందిస్తున్న కోర్సుల తీరును ఐటీఐ ప్రిన్సిపల్ దేవానంద్, ఫ్యాకల్టీని అడిగి తెలుసుకున్నారు.

 గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 68 అడ్వాన్స్ టెక్నాలజీ​ సెంటర్లను మంజూరు చేశామని, ఒక్కోదానికి రూ.42 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.  ఐటీసీల్లో ఆరు ఇండస్ట్రీస్​ కోర్సులపై శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. టెక్నాలజీని స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్​ మోతిలాల్, టీజీఐఐసీ చీఫ్​ ఇంజనీర్​ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.