శివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పూజలు

మేళ్లచెరువు, వెలుగు : మేళ్లచెరువు శివాలయాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు​ఆలయ అర్చకులు విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి శేషవస్త్రంతో శరత్​ను ఈవో  కొండారెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.