గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం

గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరాలని కోరుతూ ప్రిన్సిపాల్‌ విజయానంద్‌రెడ్డి, లెక్చరర్లు మంగళవారం ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్ కాలేజీలో కన్నా ప్రభుత్వ కాలేజీలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, నాణ్యమైన ఫ్యాకల్టీ ఉన్నారని ఆర్మూర్‌‌ టౌన్‌లోని జడ్పీ హైస్కూల్​విద్యార్థులకు వివరించారు. 

ప్రభుత్వం స్కాలర్‌‌షిప్స్, బుక్స్‌, హాస్టల్ సౌకర్యం కల్పిస్తోందని, విద్యార్థులు కాలేజీలో చేరాలని సూచించారు. లెక్చరర్లు రవి చంద్రశేఖర్, నరేశ్‌, సుభాశ్‌ పాల్గొన్నారు.