తమిళనాడు బతకాలంటే పిల్లల్ని కనండి : కొత్త జంటలకు మంత్రి పిలుపు

తమిళనాడు బతకాలంటే పిల్లల్ని కనండి : కొత్త జంటలకు మంత్రి పిలుపు

రాష్ట్రం బతకాలంటే పిల్లల్ని కనండి..కొత్త జంటలు అదే పనిలో ఉండండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడులో జననాల రేట్లు తగ్గిపోయింది.. దాని ప్రభావం రాష్ట్రంపై చాలా ఉంటుంది.. పార్లమెంట్ సీట్ల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరుగుతోంది. యువ జంటలకు  విజ్ణప్తి చేస్తున్నా..దయచేసి పిల్లల్ని వెంటనే కనండి అని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచించారు. 

‘‘ఓ మ్యారేజ్ ఫంక్షన్ కు హాజరైన ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు రాష్ట్రంలో బర్త్ కంట్రోల్ చేపట్టాం.. ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నాం.. డిలిమిటేషన్ అమలు చేస్తే మనం 8 పార్లమెంటరీ సీట్లను కోల్పోతాం.. అదేవిధంగా నార్తర్న్ స్టేట్స్ 100కు పైగా సీట్లను పొందుతాయి.. తమిళనాడుకు అన్యాయం జరగ్గకుండా ఉండాలంటే  బర్త్ రేట్ పెంచాల్సిన అవసరం ఉందని’’ ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తమిళనాడు గుర్తింపు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.. అందుకే మీ పిల్లలకు తప్పనిసరిగా తమిళ పేర్లను పెట్టండి అని సూచించారు. 

ALSO READ | ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. డిప్యూటీ చైర్మన్‎​కు AICC చీఫ్ క్షమాపణ

దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ ప్రభావం చూపుతుందన్న చర్చల క్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని రాజకీయ పార్టీలు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఇదే విషయంలు అనేక సార్లు లేవనెత్తారు.

మరోవైపు బెంగళూరులో తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె పొన్ముడి, ఆర్ఎస్ ఎంపీ ఎంఎం అబ్దుల్లా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమత్‌తో సమావేశమయ్యారు.  బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిం చిన లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మార్చి 22న చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్వహిస్తున్న దక్షిణ భారత రాష్ట్రాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాల్సిందిగా కర్ణాటక డిప్యూటీ సీఎంను డీఎంకే మంత్రి ఆహ్వానించారు.