గ్రేటర్వరంగల్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని, వారికి రావాల్సిన 5 శాతం రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలని నవ తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ర్ట అధ్యక్షుడు ఎండీ అజీమ్ కోరారు. ప్రతి శనివారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించే దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో ఆయన ఫోరం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో ట్రైన్ రాయితీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, రైల్వే స్టేషనల్టికెట్ కౌంటర్లలో అవి చెల్లడం లేదని, కారణం అడిగితే ఆ డాక్టర్ ఇచ్చినవి చల్లవని చెబుతున్నారన్నారు. అర్హత కలిగిన డాక్టర్‌తో రాయితీ పాసులు ఇప్పటించాలని కోరారు.