రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది: డిప్యూటీ మేయర్ ​మోతె శ్రీలత

రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యం పెరిగింది: డిప్యూటీ మేయర్ ​మోతె శ్రీలత

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మరింత ప్రాధాన్యం పెరిగిందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి అన్నారు.  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.  సోమవారం చిలకలగూడలో  ఏర్పాటు చేసిన  కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమానికి  ఆమె హాజరయ్యారు.  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జితేందర్, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ జనరల్ సెక్రటరీ రేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు.