
మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రిశా రాజేశ్ సింగ్ (Prisha Rajesh Singh),తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హిందీ, తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. నిఖిల్ 'స్పై' మూవీతో ప్రిశా రాజేశ్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం అల్లు శిరీష్ జోడీగా బడ్డీ మూవీలోనూ అలరించింది. ఇందులో ఎయిర్ హోస్ట్ రోల్లో నటించిన ఈ భామ.. కుర్రకారు మనసు దోచేసింది.
అయితే బాక్సాఫీస్ వద్ద ఈ బ్యూటీ నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో పెద్దగా చాన్స్లు దక్కలేదు. నటిగా తనను తాను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు మూవీల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ లుక్స్తో కుర్రకారుకు మత్తు వల విసురుతోంది.
ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తూ నెటిజన్లను ఇంప్రెస్ చేసే ఈ భామ తాజాగా వైట్ కాస్టూమ్లో దిగిన పిక్స్ ఇన్స్టాలో షేర్ చేసింది. క్యూట్ లుక్స్తో ఫొజులు ఇస్తూ స్కిన్ షోతో పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ప్రితా హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.