బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నాంపల్లి గ్రౌండ్లోని నుమాయిష్లో ఏర్పాటు చేసిన స్టాల్ను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం ప్రారంభించారు. 24 ఏళ్లుగా నుమాయిష్ లో స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు. వచ్చే ఆదాయంతో ఖైదీలకు నెలవారీ జీతాలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది నుమాయిష్ లో రూ.20 లక్షలు అమ్మకాలు జరిగాయని, రూ.30 లక్షల టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.
ఖైదీలు చేసిన వస్తువులు, ఫుడ్ఐటమ్స్, ఆర్గానిక్ కూరగాయలు అందుబాటులో ఉంటాయన్నారు. చర్లపల్లి, చంచల్ గూడ, మహిళా జైళ్ల సూపరింటెండెంట్లు, జైలర్లు పాల్గొన్నారు.గండిపేట: గండిపేటలోని తెలంగాణ పోలీస్ అకాడమీలో కొత్తగా ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ సెంటర్‌ను అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ గురువారం ప్రారంభించారు. అకాడమీలోని మహిళా సిబ్బంది పిల్లలకు ఉపయోగపడేలా అమెనిటీస్ బ్లాక్‌లో ఈ సదుపాయాన్ని కల్పించారు. రెండు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఆడుకునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.