తండ్రిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు

సుల్తానాబాద్, వెలుగు: తండ్రిని కొట్టి చంపిన కొడుకుకు పెద్దపల్లి జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన కత్తెర్ల మహేశ్ 2021 మే 7న తన తండ్రి లచ్చయ్య(51)ను రోకలిబండతో కొట్టి చంపాడు. 

మృతురాలి భార్య లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. పెద్దపల్లి సెషన్స్ కోర్టులో కొంతకాలంగా విచారణ జరగగా, మహేశ్​హత్య చేసినట్లు తేలింది. జడ్జి డాక్టర్ డి.హేమంత్ కుమార్ గురువారం మహేశ్ కు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.