సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

 సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా  సెంట్రల్ జైలులో ఓ ఖైది మృతి చెందడం కలకలం రేపుతోంది.   గుండె నొప్పి తో మృతి చెందినట్టు జైలు అధికారులు చెబుతున్నారు. గంజాయి కేసులో అరెస్ట్ అయిన  వెంకటేశ్ గా గుర్తించారు నర్సాపూర్ ఎక్సైజ్ అధికారులు . 

అయితే వెంకటేశ్  మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడని..నిన్న ములాఖత్ కు వచ్చినప్పుడు కూడా మంచిగా మాట్లాడాడు. అతనికి ఏ రోగం లేదు..ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇవాళ వెంకటేశ్ చనిపోయాడాని జైలులు అధికారులు చెబుతున్నారు.  తనను చూపెట్టడం లేదు. అధికారులు కూడా లోపలికి వెళ్లనివ్వడం లేదు. దయచేసి తమకు న్యాయం చేయాలి.  దీనికి మీడియా సహకరించాలని మృతుడి అన్నయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు.