చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీ పరార్

చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి హుస్సేన్ అనే ఖైదీ పరారయ్యాడు.  జైల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న హుస్సేన్ వ్యవసాయ క్షేత్రంలో నుండి పరారయ్యాడు. జైలు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల హుస్సేన్ బెయిల్ ను హైకోర్టు నిరాకరించినట్లుగా సమాచారం. సీసీ కెమారాల అధారంగా నిందింతుడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. 

చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీలు పరారీ కావటం ఇదేం కొత్తగా కాదు. 2015లో నర్సింహులు అనే ఖైదీ కూడా పరారయ్యాడు. 2020లోనూ ఓ ఖైదీ ఇలాగే పారిపోయారు. జీవిత ఖైదు అనుభవించే ఖైదీలను ఓపెన్ ఎయిర్ బ్యారెక్స్ లో ఉంచుతారు. వాళ్లకు అక్కడే ఉపాధి కల్పిస్తుంటారు అధికారులు. సంవత్సరాల తరబడి శిక్ష అనుభవిస్తుండటంతో మానసిక ఒత్తిడులకు గురవుతున్నారు ఖైదీలు. ఈ క్రమంలోనే ఓపెన్ ఎయిర్ జైలు నుంచి తరచూ పరారీ అవుతున్నారంట ఖైదీలు.