నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు : నలభై ఏండ్ల కింద పెరోల్‌పై బయటకు వచ్చి తప్పించుకు తిరుగుతున్న ఓ ఖైదీని మహబూబాబాద్, వరంగల్ జైలు ఆఫీసర్లు గురువారం పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన సందుల వీరన్నకు 1982లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడింది. 1984లో పెరోల్‌పై బయటకు వచ్చిన వీరన్న తిరిగి జైలుకు వెళ్లకుండా ఆఫీసర్ల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
అతడిని పట్టుకునేందుకు 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న జైలు ఆఫీసర్లు చివరకు దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో పట్టుకున్నారు. మహబూబాబాద్ జైలర్ మల్లెల శ్రీనివాసరావు, వరంగల్ జైల్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, నాగరాజు, వార్డర్లు యాసిన్, రఘు ఉన్నారు.