ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా ప్రీతమ్

మోత్కూరు, వెలుగు : టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మోత్కూరుకు చెందిన నాగరిగారి ప్రీతమ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి టికెట్ ఆశించిగా పలు సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కలేదు. 2002లో ఎన్ఎస్ యూఐ లీడర్‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్‌‌‌‌లో ప్రస్థానం ప్రారంభించిన ప్రీతమ్..  జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల కమిటీల్లో పని చేశారు. రాహుల్ గాంధీ రాష్ట్రాల టూర్ కమిటీలో మెంబర్‌‌‌‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం  టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ప్రీతమ్‌‌‌‌కు   పార్టీ   ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఛాన్స్ ఇచ్చింది. దీంతో  ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని  కలిసి కృతజ్ఞతలు తెలిపారు