న్యూఢిల్లీ: భారతదేశ ఆతిథ్య పరిశ్రమకు వన్నె తెచ్చిన 94 ఏళ్ల ప్రముఖ కార్పొరేట్ హోటళ్ల వ్యాపారి పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ మంగళవారం కన్నుమూశారు. 'బికీ'గా ప్రసిద్ధి చెందిన ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ తన జీవితకాలంలో 32 హోటళ్లతో కూడిన విశాలమైన చెయిన్‌ను నిర్మించారు. ఈఐహెచ్కు ఒబెరాయ్, ట్రైడెంట్ పేరుతో హోటల్స్ ఉన్నాయి.
హోటల్ మాగ్నెట్గా ఆయన పేరు సంపాదించుకున్నారు. పీఆర్‌ఎస్ ఒబెరాయ్ ఫిబ్రవరి 3, 1929న న్యూఢిల్లీలో జన్మించారు. 1988 నుంచి అనారోగ్య కారణాలతో గత ఏడాది మేలో పదవీ విరమణ చేసే వరకు కంపెనీ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన నాయకత్వంలో కంపెనీ 1988 నుంచి పనిచేయడం మొదలయింది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హోటల్ కంపెనీలలో ఒకటిగా విస్తరించింది. ఆయనకు ముగ్గురు పిల్లలు. కుమారుడు విక్రమ్‌జిత్ సింగ్ ఒబెరాయ్ -ఈఐహెచ్ హోటల్స్ సీఈఓ కాగా, కుమార్తెలు నటాషా, అనస్తాసియా ఉన్నారు.
తన వారసుడి పేరును మాత్రం ఆయన ప్రకటించలేదు. 2008లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం -- పద్మవిభూషణ్ ఆయనను వరించింది.