ఇదేం కొట్టుడురా అయ్యా.. పృథ్వీ షా డబుల్ సెంచరీ

ఇదేం కొట్టుడురా అయ్యా.. పృథ్వీ షా డబుల్ సెంచరీ

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా పేట్రోగిపోయాడు. జాతీయ జట్టులో చోటు సంపాదించడం లక్ష్యంగా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుటపెట్టిన ఈ టీమిండియా యువ బ్యాటర్.. అలాంటి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 

కౌంటీల్లో నార్తాంప్టన్ షైర్ జట్టు తరఫున ఆడుతున్న పృథ్వీ షా గురువారం(ఆగస్ట్‌ 9) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేశాడు. షా ధాటికి నార్తంప్టన్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా డబుల్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. అతనికి సామ్‌ వైట్‌మ్యాన్‌ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) చక్కని సహకారం అందించారు. షా విధ్వంసం ధాటికి సోమర్‌సెట్‌ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్‌ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు.

తొలి భారత ఆటగాడిగా..

ఈ మ్యాచ్‌లో 244 పరుగులు చేసిన షా, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా రెకార్డుల్లోకెక్కాడు. అలాగే ఈ టోర్నీ డబుల్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా తన పేరును లిఖికిన్చుకున్నాడు. అంతేకాదు ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్‌లో ద్విశతకం బాదిన తొలి భారత ఆటగాడు కూడా షానే కావడం గమనార్హం.