మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించిన ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పృథ్వీరాజ్ ది గోట్ లైఫ్(The Goat Life) తెలుగులో ఆడు జీవితం గురువారం (మార్చి 28న) థియేటర్లో రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.బెన్యామిన్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దీన్ని తెరకెక్కించారు.
ఆడుజీవితం కలెక్షన్స్ విషయానికి వస్తే..
ఈ మూవీ ఫస్ట్ డే ఇండియాలో రూ.7.45 కోట్లు వసూలు చేయగా..వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి రూ.16 కోట్లు రికార్డ్ కలెక్షన్స్ చేయడం విశేషం. మొదటినుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అలా అందరు ఊహించినట్లే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో రూ. 100 కోట్ల దిశగా అడుగేస్తోంది.
Also Read: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా
మలయాళంలో రూ.6.5 కోట్లు వసూలు చేయగా..తెలుగు రాష్ట్రాల్లో రూ.40 లక్షలు, కన్నడలో రూ.40 లక్షలు, తమిళంలో రూ.50 లక్షలు, హిందీలో రూ.10 లక్షల వరకు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మలయాళంలో మంచి క్రేజీ తెచ్చుకున్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కావడంతో అక్కడ ఈ సినిమాకు ఓ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. కేరళలో ఫస్ట్ డే 57.79 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కథేంటంటే:
నజీబ్ మహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) (Prithviraj Sukumaran) ఉపాధి కోసమని తన స్నేహితుడు హకీం (కేఆర్ గోకుల్)తో కలిసి సౌదీ వెళ్తాడు. ఏజెంట్ చేసిన మోసం కారణంగా అనుకున్న ఉద్యోగం దొరక్కపోగా, బలవంతంగా గొర్రెల్ని కాయడం కోసం తీసుకెళతాడు యజమాని. వెళ్లిన ఇద్దరినీ వేర్వేరు చోట్ల వదిలిపెడతాడు. భాష తెలియక, ఎడారి మధ్యలో సరైన తిండి, నీళ్లు లేక, యజమానుల వేధింపులతో ఎన్నో అవస్థలు పడతాడు నజీబ్. అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి వెళ్లిపోవాలనుకున్న అతడు చివరికి ఏం చేశాడు? తనతోపాటు వచ్చిన హకీంని అసలు కలిశాడా? తన కుటుంబాన్ని మళ్లీ కలుసుకున్నాడా? అనేది ఈ సినిమా కథ.
ఆడు జీవితం సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అదేంటంటే..పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందించిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఇది కావడం విశేషం.దాదాపు ఐదేళ్లు ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా కష్టపడ్డానని పృథ్వీరాజ్ ఎన్నోసార్లు స్టేజీ పైన చెప్పుకొచ్చాడు.