పృథ్విరాజ్ సుకుమారన్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘కడువా’. షాజీ కైలాస్ దర్శకత్వంలో సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 30న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్విరాజ్ మాట్లాడుతూ ‘నా గత చిత్రం ‘జనగణమన’ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడ మంచి వసూళ్లను రాబట్టింది.
‘కడువా’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను ఆడియెన్స్ ఇష్టపడతారు. త్వరలోనే తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల కలయికలో పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయనే నమ్మకం ఉంది’ అన్నాడు. ‘తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్యాషన్. ‘భీమ్లా నాయక్’ విడుదల అప్పుడు థియేటర్ లో పండగ వాతావరణం చూశాను. ‘కడువా’ చూస్తున్నపుడు కూడా అదే సెలబ్రేషన్స్ ఉంటాయని భావిస్తున్నా’ అని చెప్పింది సంయుక్తా మీనన్. వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ ‘ఇదొక రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్ లా ఈ సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.