Daayra: పృథ్వీరాజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. క్రైమ్ డ్రామా జోనర్లో మూవీ అనౌన్స్

Daayra: పృథ్వీరాజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. క్రైమ్ డ్రామా జోనర్లో మూవీ అనౌన్స్

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారిగా స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈ జంట కలిసి నటించనున్నారు. గ్రిప్పింగ్ క్రైమ్-డ్రామా నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు 'దైరా' (Daayra) అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

వాస్తవిక సంఘటనల ఆధారంగాతెరకెక్కనున్న ఈ మూవీలో  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోలీసుగా కనిపించనున్నారు. నేరం, శిక్ష మరియు న్యాయం మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

ఈ క్రైమ్-డ్రామా థ్రిల్లర్ కోసం దర్శకురాలు మేఘనా గుల్జార్‌ ఓ సాలిడ్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. సమాజంలో జరుగుతున్న క్రైమ్స్.. 'చట్టం మరియు న్యాయం' సరిహద్దులు దాటినపుడు ఓ పోలీస్ ఏం చేశాడనేది స్టోరీగా రానున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో హీరో పృథ్వీరాజ్ మాట్లాడుతూ "ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. హిందీ సినిమాలో నటిస్తున్నండటం చాలా హ్యాపీ. దర్శకురాలు మేఘనా గుల్జార్‌ మేకింగ్ స్టైల్కు నేను పెద్ద ఫ్యాన్. ఆమె దర్శకత్వంలో నటించాలనేది నా కల. దైరా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పృథ్వీరాజ్ అన్నారు. 

ALSO READ : Manchu Manoj: మనోజ్‍ను చూసి మంచు లక్ష్మి కన్నీరు.. వైరల్ అవుతున్న వీడియో

నటుడిగా, దర్శకుడిగా 'L2:ఎంపురాన్' తో భారీ విజయం అందుకున్నారు పృథ్వీరాజ్. ఈ మూవీ రూ.250కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, మలయాళ ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తన నెక్స్ట్ ఫిల్మ్ 'దైరా' కోసం మేకోవర్కు ప్రిపేర్ అవుతున్నాడు. వీటితో పాటుగా మహేష్ బాబు-రాజమౌళి మూవీలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.